- వార్లి గ్రామంలో పట్టపగలే రౌడీయిజం
- అందరూ చూస్తుండగానే ఇల్లు ధ్వంసం
- భూమి వివాదం దారుణానికి దారి
- ఇంట్లో లేని సమయంలో దుండగుల దాడి
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా – వాంకిడి: వాంకిడి మండలం నౌదరి గ్రామపంచాయతీ పరిధిలోని వార్లి గ్రామం లో దారుణ ఘటనకు ఆవాసంగా మారింది. స్థానికుడు వాడై సురేందర్, కొంతమంది అనుచరులతో కలిసి అదే గ్రామానికి చెందిన వాడై దీంకర్ ఇంటిపై పగలే దాడి చేసాడని. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటిని ధ్వంసం చేసాడని బాధిత కుటుంబం ఆరోపిస్తుంది.
బాధితుడు వాడై దీంకర్ తెలిపిన వివరాల ప్రకారం – “ఇది మా వారసత్వ భూమి. మా అమ్మమ్మ బిక్కు భాయ్, చిన్నమ్మ శాంతాబాయి పేర్లపై భూమి ఉంది. కానీ చిన్నమ్మ కొడుకు సురేందర్ అన్యాయంగా భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. చాలాకాలంగా మాతో భూ వివాదం కొనసాగిస్తున్నాడు. తాజాగా, ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఇంటి గోడలు కూల్చి, లోపల ఉన్న సామాను చిందరవందరగా పడేసి, నగదు, బంగారం దొంగిలించారని ఆరోపించాడు.
ఈ దాడితో తమ కుటుంబం రోడ్డున పడిందని వాపోయిన దీంకర్, “ఇంటినే కూలగొట్టి నిల్వనీడ లేకుండా చేసారని. ఇలాంటి ఘోరానికి పాల్పడిన సురేందర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, మా కుటుంబానికి న్యాయం చేయాలని పోలీసులను, అధికారులను కోరుతున్నాడు.
పట్టపగలే జరిగిన ఈ రౌడీయిజం గ్రామంలో తీవ్ర ఆందోళనను రేపుతోంది. అయితే ఈ ఘటనపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.