కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్‌నగర్ : యువతను, ప్రజలను మాదకద్రవ్యాల నుండి రక్షించడానికి జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ మార్గదర్శకత్వంలో, కాగజ్‌నగర్ టౌన్ పోలీసు విభాగం గంజాయి, మాదకద్రవ్యాల పై పట్టణంలో
ఎన్టీఆర్ చౌరస్తా, ఆర్.టి.సి బస్ స్టాండ్, రైల్వే స్టేషన్‌లలో టౌన్ ఎస్సై సుధాకర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించరు.
ఎస్సై మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాల వ్యసనం వలలో పడకుండా గట్టిగా హెచ్చరించారు. డ్రగ్స్ వలన భవిష్యత్తు, ఆరోగ్యం, కుటుంబ జీవితం ఎలా నాశనం అవుతాయో వివరించారు. అవగాహన కార్యక్రమం ముఖ్య అంశాలు, చట్టపరమైన పరిణామాలపై హెచ్చరిక, మాదకద్రవ్యాలను అమ్మడం, వాడటం, తరలించడం లేదా నిల్వ చేయడం అనేది ఎన్.డి.పి.ఎస్ (NDPS) చట్టం, 1985 ప్రకారం తీవ్రమైన నేరమని, అటువంటి కార్యకలాపాలలో పాల్గొనే వారికి చట్టపరమైన చర్యలు తప్పవని. మాదకద్రవ్యాల పీడనాన్ని నిర్మూలించడానికి జిల్లా పోలీస్ ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంభించిందని మాదకద్రవ్యాల రవాణా లేదా వినియోగానికి సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాల గురించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగలరని ఎస్సై తెలిపారు..
