కొమురం భీం ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇటీవల 2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమం మళ్లీ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు.
జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 13వ తేదీ నుండి యధాతధంగా నిర్వహించనున్నట్టు కలెక్టర్ తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలు, వినతులు అధికారుల దృష్టికి తీసుకురావచ్చు. సంబంధిత శాఖల అధికారుల సమక్షంలో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోబడతాయని తెలిపారు.
అర్జీదారులు, ప్రజలు ఈ విషయాన్ని గమనించి తగిన డాక్యుమెంట్లు, వివరాలతో ప్రజా