- ప్రజల పనులు కాగితాల కుప్పల్లోనే..!
కొమురం భీం, ఆసిఫాబాద్ జిల్లా – కాగజ్ నగర్ : ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులు నాయకుల ఫైరవులకే లోబడుతున్నారని పట్టణ ప్రజలు ఆవేదన వెల్లగక్కుతున్నారు. తహసీల్దార్ కార్యాలయం ప్రజల పనుల కంటే ఫైరవుల సూచనలకే ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
“ఫైరవు లేకుండా ఫైల్ కదలదంటూ” ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో పరిస్థితి మరింత దారుణంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. కార్యాలయంలో కనీసం గడియారం కూడా పనిచేయని స్థితి..! కాగితాల గుట్టలు పేరుకుపోయి ప్రజల ఫైళ్లు వాడపడ్డట్లు మాయమవుతున్నాయంటూ ప్రజల ఆవేదన వ్యక్తమవుతోంది. ప్రజల పన్నుల మీద జీతాలు తీసుకుంటూ, ఆ ప్రజలకే సేవ చేయాల్సిన అధికారులు తమ బాధ్యతలను విస్మరిస్తున్నారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ మాజీ నాయకులకు మాత్రం రాచమర్యాదలు, సామాన్య ప్రజలకైతే నిర్లక్ష్యమే పాలు అని ప్రజలు మండిపడుతున్నారు.
“మా పనులు చేయించుకోవాలంటే ఫైరవులు కావాలి.. లేని పక్షంలో మా ఫైళ్లు పుట్టిన చోటే చస్తాయి’’ అని ఒక పౌరుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇకనైనా ధికారులు స్పందిస్తారా లేదా వేచి చూడాలి…