కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా / కాగజ్‌నగర్: జూబ్లీహిల్స్ బైఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించడంతో కాగజ్‌నగర్ పట్టణంలో పార్టీ కార్యకర్తలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చౌరస్తాలో పటాకులు పేల్చి పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ బైఎన్నికలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ముందుగా జూబ్లీహిల్స్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, “బిఆర్ఎస్, బీజేపీ పార్టీలు కలిసి కాంగ్రెస్‌పై దుష్ప్రచారం చేసినా, ప్రజలు వాటిని నమ్మలేదు. సీఎం రేవంత్ రెడ్డి రెండు సంవత్సరాల పాలనపై ప్రజలకు నమ్మకం, విశ్వాసం ఉంది. అందుకే కాంగ్రెస్ అభ్యర్థికి విజయాన్ని అందించారు” అని అన్నారు.
నవీన్ యాదవ్‌కు మరోమారు శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రజల ఆశీర్వాదంతో పార్టీ మరింత బలంగా ముందుకు సాగుతుందని ఎమ్మెల్సీ విఠల్ నమ్మకం వ్యక్తం చేశారు.










