కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా : కాగజ్ నగర్ పట్టణం లోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ అమలును నిలిపివేయాలని సిఐటియు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ముంజం. శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం వేతనాల కోడ్ (2019), పారిశ్రామిక సంబంధాల కోడ్ (2020), సామాజిక భద్రతా కోడ్ (2020), వృత్తిపరమైన భద్రతా, ఆరోగ్యం మరియు పని పరిస్థితుల కోడ్ (2020) నవంబర్ 21, 2025 నుండి అమలు చేయడానికి తీసుకున్న నిర్ణయాన్ని సిఐటియు తెలంగాణ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కమిటీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నది. కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలు, గరిష్ట లాభాల కోసం చేసిన నష్టదాయక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు.









