contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రేవంత్ రెడ్డిది ప్రజాపాలన కాదు – ప్రజలను పీడించే పాలన

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: సిఎం రేవంత్ రెడ్డిది ప్రజాపాలన,ఇందిరమ్మ పాలన కాదు.ఇది ప్రజల మీద ప్రతీకార పాలన,పీడిస్తున్న పాతాలానికి తొక్కేస్తున్న పాలన అంటూ బి ఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ రోజు కాగజ్ నగర్ లోని ప్రాణహిత నిలయంలో జరిగిన పత్రికా సమావేశంలో మాట్లాడారు.  ఆసిఫాబాద్ జిల్లా వాహన యజమానుల సంఘం నాయకులు కలిసి ఆర్టిఓ కార్యాలయ అధికారుల వేధింపుల పై ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఆర్టీఏ అధికారుల ధన దాహానికి అడ్డు,అదుపు లేదన్నారు. ఆసిఫాబాద్ ఆర్టివో కార్యాలయం అవినీతికి, అక్రమాలకు అడ్డాగా మారిందన్నారు. ప్రతి రోజు సాయంత్రం 4 గం.లకు కార్యాలయం ముందు ప్రైవేట్ దందా ప్రారంభమవుతుందన్నారు. అధికారులు ఒక్కో పనికి ఒక్కో రేటు ఫిక్స్ చేసి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎసిబి అధికారులు వస్తే ముందే సమాచారం తెలుస్తుందని ఆరోజు దళారులు, ఏజెంట్లు ఆఫీసుకు రాకుండా జాగ్రత్త పడుతున్నారని తెలిపారు.రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెక్ పోస్టులు ఎత్తేయడంతో, ఆదాయం తగ్గిందని ఆర్టీఏ అధికారులు వాహనదారులను వేధిస్తున్నారని రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.మారుమూల అసిఫాబాద్ లోనే ఇలా ఉంటే మహా నగరాల్లో ఎంత అవినీతి ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. గత బిఆర్ఎస్ 3 ఏళ్ల క్రితం బోరిగాంలో డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తే, ఇప్పటికి అర్హులకు ఎవరికీ కేటాయించలేదని,గృహ నిర్మాణ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని నిలదీశారు. స్థానిక ఎమ్మెల్యే హరీష్ బాబు కాట్రాక్టర్ల నుండ్ 9 శాతం కమీషన్లు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. దహెగాం మండలంలోని గెర్రె గ్రామంలో తలండి శ్రావణి అనే 9 నెలల గర్భవతిని కులాంతర వివాహం చేసుకుందని హత్య చేస్తే,చట్ట ప్రకారం రావాల్సిన పరిహారం నెల రోజులు గడిచినా ఇప్పటివరకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.కలెక్టర్ ప్రొసీడింగ్ ఇచ్చి 15 రోజులు గడిచినా చెక్ కూడా ఇవ్వడం లేదని,ప్రభుత్వం వద్ద 4 లక్షలు కూడా ఇవ్వరా అంటూ ధ్వజమెత్తారు. దళితులు,గిరిజనులకు ఇవ్వడానికి డబ్బు లేదు కానీ ,10వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ కోసం మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి మరీ 4 వేల కోట్ల రోడ్లకు సిఎం రమేష్ కు కాంట్రాక్టులు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలో ఓటుకు 2500,చీరలు, కుక్కర్లు ఇవ్వడానికి డబ్బు ఎలా వచ్చిందని అడిగారు. గిరిజన శాఖ మంత్రి సీతక్క వల్ల ఆదివాసులకు కూడా ఏం లాభం జరగడం లేదన్నారు. దహెగాం మండలం కల్వడలో ప్రభుత్వ భూమిని హడ్కర్ మధుకర్ అనే వ్యక్తి దురాక్రమణ చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారో చెప్పాలన్నారు. సిర్పూర్ నియోజకవర్గంలోని ప్రతి మండలంలో డయాలసిస్ సెంటర్ పెట్టారని,ఎందుకు కిడ్నీ పేషెంట్లు పెరుగుతున్నారో పరిశోధన చేయాలని ప్రభుత్వానికి సూచించారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని,ఎకరానికి 7 క్వింటాళ్ల నిబంధన తొలగించాలని,రైతుల పంట కొనుగోలుకు అడ్డంకులు సృష్టించొద్దన్నారు.అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగితే పరిహారం ఇవ్వలేదని,బోనస్ కూడా ఇవ్వలేదని,యూరియ ఇవ్వలేదు. పంట కొనడం లేదని అసహనం వ్యక్తం చేశారు. 700 మంది రైతులు మరణించినా పట్టించుకోని ప్రభుత్వం కాంగ్రెస్ మాత్రమేనన్నారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కర్రు కాల్చి వాత పెడుతారన్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇవ్వకుండా కాలేజీలు బంద్ చేశారని ఆరోపించారు.  కాంగ్రెస్ ప్రభుత్వం రైతు,మహిళ, విద్యార్థి,ఉద్యోగ వ్యతిరేక ప్రభుత్వమని స్పష్టం చేశారు. రేపు జరిగే ప్రతిఙ్ఞ దివస్,తన జన్మదిన వేడుకలకు నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తలు,అభిమానులు అందరూ హాజరుకావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ లెండుగురె శ్యాం రావు,కొంగసత్యనారాయణ,మండల అధ్యక్షులు పార్వతి అంజన్న,మిన్హాజ్,,యూత్ అధ్యక్షులు కాశిపాక రాజు, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :