కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఉట్నూర్ సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మాట్ అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని ఉట్నూర్ లోని వికాసం ప్రత్యేక పాఠశాల ఆధ్వర్యంలో కొమురం భీమ్ కాంప్లెక్స్ లో నిర్వహించిన వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందని,దివ్యాంగుల అవసరాల దృష్ట్యా వారికి కావలసిన సహాయ ఉపకరణాలు, దివ్యంగ పిల్లలకు కావలసిన సహాయం అందించడం జరుగుతుందని . ప్రత్యేక అవసరాలు గల పిల్లల కొరకు ఉపాధ్యాయులను నియమించి మంచి బోధన అందించే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. వికాసం ప్రత్యేక పాఠశాలను 10వ తరగతి వరకు ఆధునికరిస్తామని తెలిపారు . ఈ కార్యక్రమంలో ఐటీడీఏ డి.డి. అంబాజీ జాదవ్, ఉట్నూర్ ఎ టి డి ఓ సదానందం, ఆదిలాబాద్ ఎ టి డి ఓ నిహారిక, బోథ్ ఎ టి డి ఓ, ఎ సి ఎం ఓ జగన్, ఐటీడీఏ బి.ఈడి. కళాశాల ప్రిన్సిపాల్ రాథోడ్ మాణిక్ రావు, వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు, వికాసం ప్రత్యేక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాథోడ్ వికాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










