కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా/ సిర్పూర్ : ఓటమి జీర్ణించుకోలేక ఓ ప్రత్యర్థి గెలుపొందిన సర్పంచ్ భర్త పై వేట కొడవలితో దాడి పాల్పడిన సంఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి మండలంలో కలకలం రేపింది. సిర్పూర్ టీ మండలంలోని ఇటిక్యాల పహాడ్ గ్రామ పంచాయతీ కు ఆదివారం జరిగిన రెండోవ విడత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి వాడై తాను బాయి గెలుపొందగా ప్రత్యర్థి భర్త మొహర్లే భీం రావు ఓటమి జీర్ణించుకోలేక సోమవారం ఉదయం సదరు మహిళ సర్పంచ్ ఇంటికి వెళ్లి ఆమె భర్త పోశేట్టిపై వేట కొడవలితో దాడికి యత్నించగా ఆయన తృటిలో తప్పించుకున్నారు. స్థానిక గ్రామస్తులు గమనించి దాడి యత్నించిన భీం రావు అడ్డుకుని..తాడుతో బంధించి చితకబాదారు. అనంతరం స్థానిక పోలీసులకు అప్పగించారు.










