- ఓ ఇంట్లో తలదాచుకున్నట్లు వచ్చిన సమాచారంతో కూంబింగ్..
- 16 మందిని అరెస్టు చేసిన పోలీసులు.
- సిర్పూర్ యూ మండలంలో సంఘటన..
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోలీసులు 16 మంది మావోయిస్టుల పట్టివేత కలకలం రేపుతోంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి సిర్పూర్ యూ మండలంలోని అటవీ ప్రాంతంలోని ఓ ఇంట్లో మావోయిస్టులు తలదాచుకున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఏఎస్పీ చిత్తరంజన్ ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ పోలీసుల బృందం సిర్పూర్ యూ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించి. మావోయిస్టులు తలదాచుకున్న ఇంటిని స్పెషల్ పార్టీ పోలీసులు చుట్టూ ముట్టి 16 మంది మావోయిస్టుల అరెస్టు చేసినట్లు సమాచారం. ఇందులో 7 పురుషులు. 9 మహిళలు ఉండగా 4 మంది మెయిన్ క్యాడర్ వాళ్ళు ఉన్నట్లు తెలుస్తోంది. మావోయిస్టుల పట్టివేత సంబంధించి జిల్లా పోలిస్ శాఖ నుంచి అధికారంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.










