కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా : కౌటాల మండల కేంద్రము లోని తాటిపల్లి గ్రామ పంచాయితీ ఎన్నికలలో నూతనంగా ఎన్నికైన తాటిపల్లి సర్పంచ్ బడగే సంతోష్, ఉప సర్పంచ్ దొంగ్రె కేశవ్ రావు వార్డ్ మెంబెర్స్ ను సన్మానించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయితీ పాలకవర్గం కొత్త ఉత్సవం తో పనిచేసి గ్రామ అభివృదియే ప్రధాన లక్ష్యంగా పని చేయాలని అన్నారు తాగునీరు సరఫరా మరియు డ్రైనేజ్ వ్యవస్థ ,SC,ST, వాల్మీకి కమిటీ హల్ భవనం నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తామని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో గ్రామస్తులు, యువకుల పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు










