కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : కాగజ్‌నగర్ మండలంలోని బురదగూడెం గ్రామ పంచాయతీలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన చాటరే స్వాతి ఘన విజయం సాధించారు. ఆమె తన ప్రత్యర్థిపై 142 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం విశేషం.
రెండవసారి సర్పంచ్‌గా ఎన్నికైన సందర్భంగా సర్పంచ్ స్వాతి (పోశెట్టి) గ్రామ పంచాయతీ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనపై మరోసారి నమ్మకం ఉంచి గెలిపించినందుకు గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామ పంచాయతీని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని, నిరంతరం ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధి, సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలు కోసం కట్టుబడి ఉంటానని తెలిపారు.
ఈ విజయంతో బురదగూడెం గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.










