కొంరంభీం ఆసిఫాబాద్ జిల్లా: కగజ్ నగర్ మండలం, వేంపల్లి టింబర్ డిపోలో తేదీ 23.12.2025 మంగళవారం ఉదయం 11.00 గంటలకు కలప అమ్మక కార్యక్రమం నిర్వహించబడనున్నట్లు అటవీ శాఖ తెలిపింది.ఈ కలప అమ్మకాన్ని జిల్లా అటవీ అధికారి శ్రీ నీరజ్ కుమార్ తిబ్రేవాల్, IFS నిర్వహించనున్నారు. అటవీ శాఖ నిబంధనల ప్రకారం ఈ అమ్మకం పూర్తిగా పారదర్శకంగా నిర్వహించబడుతుందని తెలిపారు. అర్హత కలిగిన కలప వ్యాపారులు, వినియోగదారులు ఈ అమ్మకంలో పాల్గొనవచ్చని, పాల్గొనే వారు ముందుగా నిర్ణయించిన షరతులు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అటవీ శాఖ సూచించింది. కలప రకాలు, పరిమాణం, వేలం విధానం, రిజిస్ట్రేషన్ వివరాల కోసం ఆసక్తి గల వారు వేంపల్లి టింబర్ డిపో కార్యాలయాన్ని సంప్రదించాలని అటవీ సంపదను సుస్థిరంగా వినియోగించడమే లక్ష్యంగా ఈ కలప అమ్మకాన్ని నిర్వహిస్తున్నామని, అందరూ సహకరించాలని జిల్లా అటవీ అధికారి కోరారు.










