మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కామారెడ్డిలో భారీ షాక్ తగిలింది. ఇద్దరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ సమక్షంలో… 4వ వార్డ్ కౌన్సిలర్ పిడుగు మమత సాయిబాబా, 29వ వార్డ్ కౌన్సిలర్ అస్మా అమ్రీన్ అంజద్ పార్టీలో చేరారు. షబ్బీర్ అలీ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తాము కాంగ్రెస్ ప్రకటించి… అమలు చేస్తోన్న ఆరు గ్యారెంటీల పథకం పట్ల వారు ఆకర్షితులమయ్యామని, అందుకే అధికార పార్టీలో చేరామని చెప్పారు. కాగా కామారెడ్డిలో మరికొందరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది.