కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని ఖాసీంపేట గ్రామానికి చెందిన మహిళ రైతు గంప రుక్కవ్వ సోమవారం ప్రజావాణిలో కరీంనగర్ కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది, ఇటీవల తాను పండించిన 227 బస్తాల వరి ధాన్యం ఐకెపి కొనుగోలు కేంద్రంలో విక్రయించింది. ఒక్క బస్తాకు 43 కిలోల చొప్పున తూకం వేసి ఒక్క బస్తాకు తరుగు,తాలు పేరిట రెండు కిలోలు కట్ చేయగా మొత్తం 86 క్వింటాళ్లు 26 కిలోలు అయిందని తూకం వేసిన రశీదును సెంటర్ నిర్వాహకులు అందజేశారు. తర్వాత తన అకౌంట్లో 79 క్వింటాళ్లు 60 కిలోలకు మాత్రమే డబ్బులు జమ అయ్యాయి. మహిళ రైతు రుక్కవ్వ సెంటర్ నిర్వాహకులను అడుగగా మిల్లర్లు కట్ చేశారని, దానికి ఏం చేయలేమని దాటవేసినట్లు తెలిపారు, ధాన్యం డబ్బులపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కరీంనగర్ కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది, రైతుల దగ్గర తరుగు పేరుతో కొనుగోలు కేంద్రాల నిర్వాకులు విచ్చలవిడిగా దోచుకుంటుండం తో రైతులు ఆందోళన చెందుతున్నారు. సెంటర్ నిర్వాహకుల తీరుతో ఎంతో నష్టపోతున్నట్లు పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి తాము నష్టపోయిన ధాన్యం డబ్బులను తమకు తిరిగి ఇప్పించాలని మండల రైతులు కోరుతున్నారు.
