పిఠాపురం : పట్టణంలో బొజ్జావారి తోటలో లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సామాజిక సేవ కార్యక్రమాలు గుర్తించి మెగా హెల్పింగ్ ఫౌండేషన్ చైర్మన్ శీరిషారెడ్డి లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ చైర్మన్ టి.కామేశ్వరరావు (కరుణ్ రాజు)కు గోల్డ్ స్టార్ ప్రతిభా సేవ పురస్కారం ప్రకటించారు. మెగా హెల్పింగ్ ఫౌండేషన్ చైర్మన్ శిరీషారెడ్డి నిర్వహిస్తున్న 8వ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ఆడిటోరియంలో ఈ పురస్కారాలు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ యాక్టర్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్, హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ అడిషనల్ డి.యస్.పి రామదాసు తేజావత్, బుల్లితెర నటీమణి నయ్ నీషా, టివి సీరియల్, సినిమా యాక్టర్ మరియు యాంకర్ సుమీత్ రాయ్ ఇతర అతిధుల చేతులు మీదుగా లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ చైర్మన్ టి.కామేశ్వరరావు (కరుణ్ రాజు)కు గోల్డ్ స్టార్ ప్రతిభా సేవా పురస్కారంతో సత్కరించారు.ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ కామేశ్వరరావు (కరుణ్ రాజ్) మాట్లాడుతూ ఈ అవార్డు వల్ల తన బాధ్యత మరింత పెరిగిందని ఆయన అన్నారు. అవార్డు అందుకున్న ట్రస్ట్ చైర్మన్ కామేశ్వరరావును కుటుంబ సభ్యులు, పట్టణంలోని రాజకీయ నాయకులు, అధికారులు, స్నేహితులు, బంధువులు అభినందించారు. భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా చేయాలని పలువురు ఆకాంక్షించారు.
