● హకీంపేట్ -కరీంనగర్ – అదిలాబాద్
● 2025 -26వ సంవత్సరానికి గాను నాలుగో తరగతి ప్రవేశానికి విద్యార్థినీ విద్యార్థుల ఎంపిక
కరీంనగర్ జిల్లా: తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలలలో
2025 -26 విద్యా సంవత్సరానికి గాను నాలుగోవ తరగతిలో ప్రవేశానికి అర్హులైన విద్యార్థిని విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడమైనది.
◆ మూడు అంచెల్లో ఎంపిక ప్రక్రియ
హకీంపేట్, కరీంనగర్, అదిలాబాదులో ఉన్న క్రీడా పాఠశాలలకు మూడు అంచెల్లో ఎంపిక విధానం ఉంటుంది. 18 జూన్ మండల స్థాయి ఎంపిక క్రీడా పోటీలు జడ్.పి.హెచ్.ఎస్ గన్నేరువరం క్రీడా మైదానంలో జరుపబడును, మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థిని విద్యార్థులు జిల్లా స్థాయిలో 23 జూన్ నుండి 26 జూన్ వరకు అందులో ఎంపికైన విద్యార్థులకు రాష్ట్రస్థాయిలో జూలై 1 నుండి జులై 5వరకు
ఎంపిక జరుగుతుంది.
◆ హకీంపేటలో బాలురులకు 20 సీట్లు బాలికలకు 20 సీట్లు
◆ కరీంనగర్ లో బాలురులకు 20 సీట్లు బాలికలకు 20 సీట్లు
◆ అదేవిధంగా అదిలాబాదులో బాలురకు 20 సీట్లు బాలికలకు 20 సీట్లు మొత్తం 120 సీట్లకు ఈ ఎంపిక జరుగుతుంది.
30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్స్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 800 మీటర్ల రన్, 6 × 10 మీటర్ల షటిల్ రన్ మెడిసిన్ బాల్ త్రో వర్టికల్ జంప్ ప్లెక్సిబిలిటీ టెస్ట్ ఎత్తు బరువు మొత్తం తొమ్మిది విభాగాల్లో 27 మార్కులకు గాను ఫిజికల్ పరీక్షలు నిర్వహిస్తారు.
పోస్టర్ బోన్ అబ్ నార్మలిటిస్ లో మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. 01-09-2016 నుండి 30-8- 2017 మధ్యన జన్మించి 8 నుండి 9 సంవత్సరాలు వయసు కలిగినవారు ఈ పోటీలకు అర్హులు. దివి: 07- 6- 2025 నుండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ 15/06/2025 లోపు చేసుకొనవలయును విద్యార్థిని విద్యార్థులు తమ మొబైల్ నుండి కానీ, లేదా tgss.telangana.gov.in లో తమ వివరాలు నమోదు చేసుకోనవచ్చు. అదేవిధంగా ఈ ప్రవేశాలకు సంబంధించిన పూర్తి సమాచారం కొరకు ఒక ప్రత్యేక క్యూఆర్ కోడ్ ను కూడా రూపొందించి విద్యార్థిని విద్యార్థులకు అందుబాటులో ఉంచడం జరిగింది. మరింత సమాచారం కొరకు పరీక్షలు నిర్వహించే తేదీ ప్రదేశము మరియు ఇతర వివారాలకు సంబంధిత జిల్లా క్రీడా మరియు యువజన శాఖ అధికారులను సంప్రదించాలని మండల విద్యాధికారి రామయ్య .ఒక ప్రకటనలో కోరారు. ఈ ఎంపిక ప్రక్రియను పూర్తి పారదర్శకంగా ఉండేవిధంగా అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నామని.. మండల విద్యాధికారి రామయ్య మరియు మండల ఎస్ జి ఎఫ్ సెక్రటరీ రమ 9494724946, 9440068866 తెలిపారు