కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం శ్రీరాంపురం గ్రామ పంచాయతీ పరిధిలో వన మహోత్సవం కార్యక్రమం లో జనసేన యువ నాయకుడు పిర్ల. శివాజీ పాల్గొని మొక్కలు నాటడం జరిగింది.
మన వృక్ష సంపదను రక్షించడం మరియు పర్యావరణాన్ని కాపాడడం అనేది ఎంతో ముఖ్యమైన బాధ్యత. ఈ వన మహోత్సవం ద్వారా ప్రజల్లో చెట్లు నాటడం, అటవీ సంపదను రక్షించడం పై అవగాహన పెంచడమే లక్ష్యం. మొక్కలు వల్ల కలిగే ప్రయోజనాలు గురించి గ్రామ ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పిర్ల వెంకట బాబ్జి. పిర్ల సత్తిబాబు, పి. రాము,జనసేన నాయకులు ,మహిళలు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయాలలో పర్యావరణ పరిరక్షణ, అడవుల సంరక్షణ భాగం అని శివాజీ అన్నారు.