contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పిఠాపురం జర్నలిస్ట్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం

పిఠాపురం : కాకినాడ జిల్లా పిఠాపురంలో స్థానిక సుర్యారాయ విద్యానంద గ్రంధాలయం మీటింగ్ హల్ నందు పిఠాపురం ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా జర్నలిస్టుల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటైన పిఠాపురం జర్నలిస్ట్స్ అసోసియేషన్ యూనియన్ ప్రారంభోత్సవ కార్యక్రమం స్థానిక మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్.వి. ఎస్.ఎన్.వర్మ చేతుల మీదగా యూనియన్ లోగోను ఆవిష్కరించి ప్రారంభించారు. అనంతరం యూనియన్ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం జర్నలిస్ట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా మన ఊరు మన బాధ్యత స్వచ్చంద సేవా సంస్థ కొండేపూడి శంకర్రావు, ప్రెసిడెంట్ గా రాయుడు శ్రీనుబాబు (ప్రజాభూమి), సెక్రెటరీగా శ్యాంప్రసాద్ (వేగ న్యూస్), వైస్ ప్రెసిడెంట్ గా బళ్ళ సురేష్ (ఏ1 టివి), జాయింట్ సెక్రెటరీగా రాయుడు శ్రీను (ఎస్.ఎల్.టి), ట్రెజరర్ గా కొమ్మనాపల్లి రామకృష్ణ (ఆర్.కె టివి), సలహాదారునిగా అల్లవరపు నగేష్, సభ్యులుగా డా. యాండ్ర శ్రీ వీర వెంకట సునీల్ కుమార్ (హైదారాబాద్ హెడ్లైన్స్), కొయ్యల ఫణీంద్ర సాయి (టీజే న్యూస్), దడాల సత్తిబాబు (ఎపి లోకల్), అంచూరి లక్ష్మణస్వామి (మై టివి), బర్రె చిన్నబ్బాయి (క్రైమ్ కౌంటర్), దాసరి కామేశ్వరరావు (ఆర్టీఐ ఎక్సప్రెస్)లను పిఠాపురం జర్నలిస్ట్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులగా పాత్రికేయుల ఎన్నుకోగా శుక్రవారం ఆ కార్యవర్గ సభ్యులు బాధ్యతలను స్వీకరించి ప్రమాణ స్వీకారం చేశారు. వారి బాధ్యతలను అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తామని దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ మాట్లాడుతూ
ఎంతో చరిత్ర గల పిఠాపురంలో జర్నలిస్టులు ఐక్యంగా పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రారంభించి మరి చరిత్ర సృష్టించారు అని, నిరంతరం సమాజంలోని సమస్యలను వార్తలుగా వ్రాసే విలేఖర్లకు సమస్యలు ఉంటాయని వారి సమస్యల పరిష్కారానికి తాను కృషిచేస్తామని, జర్నలిస్టులకు వారి కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. యూనియన్ ప్రెసిడెంట్ రాయుడు శ్రీనుబాబు మాట్లాడుతూ రాగద్వేషాలకు అతీతంగా స్వప్రయోజనాలను పక్కనపెట్టి నిరంతరం ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా జర్నలిస్టులు పనిచేయాలని, ప్రజా సమస్యలపై తన కలంతో గళాన్ని వినిపిస్తూ ప్రజాస్వామ్యన్ని మానవీయ విలువలను పరిరక్షిస్తూ నిజాలను నిర్భయంగా వ్రాస్తూ నిస్వార్ధమైన జీవనం గడుపుతూ జర్నలిస్టులు ముందుకు సాగాలన్నారు. సంస్థలు వేరైనా పాత్రికేయులందరూ ఒకటేనని ఒకే కుటుంబమని అందరం ఐక్యంగా ముందుకు సాగాలని, ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని నిజాయితీగల జర్నలిస్టులకు రక్షణ చట్టం కల్పించాలి అని, పిఠాపురం నియోజకవర్గంలో జర్నలిస్టుల సంక్షేమానికి ఆత్మగౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లకుండా ఈ పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ కృషి చేస్తుంది అన్నారు. నిబద్ధత నిజాయితీగల ప్రతి జర్నలిస్టుకు, ఆ జర్నలిస్టు కుటుంబానికి ఈ అసోసియేషన్ నిరంతరం అండగా ఉంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :