పిఠాపురం : పిఠాపురం పట్నంలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ, 15వ వార్డు కౌన్సిలర్ రాయుడు శ్రీనుబాబుల ఆధ్వర్యంలో కొత్త కొంపలులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యంగా భావించి ప్రజల కష్టాల్లో ఇంటికి పెద్ద కొడుకుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విలువనిస్తున్నారన్నారు. పిఠాపురంలో 15వ వార్డు కొత్త కొంపలకు చెందిన కె.కృష్ణవేణి కుటుంబ సభ్యులకు సీఎం రిలీఫ్ ఫండ్ రూ.98,514/- మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ చేతుల మీద అందజేశారు. ఆరోగ్యశ్రీ పథకంలో వర్తించని వైద్యానికి ఖర్చులను సీఎం చంద్రబాబు నాయుడు ఉదార స్వభావంతో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చేస్తున్నారని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగో లేకపోయినా ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని వాళ్ళకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ అల్లవరపు నగేష్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు నల్లా శ్రీను, కౌన్సిలర్ బంగారు బాబు, ఏలేరు నీటి సంఘం డైరెక్టర్లు చైర్మన్ సోము సత్తిబాబు, కొరుప్రోలు శ్రీను, సోనా బాబు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లి చిన్న, అల్లం దొరబాబు, సుబ్బారావు, మీసాల రాజా, చింతపల్లి రాజు, నాళం స్వామి, రమేష్, సత్తిబాబు, సత్యనారాయణ, తిరుమలరావు, టిడిపి నాయకులు, 15వ వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.