పిఠాపురం : కూటమి అభ్యర్థిగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయనున్న పేరాబత్తుల రాజశేఖర్ ని గ్రాడ్యుయేట్ ఓటరులందరూ భారీ మెజారిటీతో గెలిపించాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ పిలుపునిచ్చారు. ఆయన ఆదేశాల మేరకు పిఠాపురం పట్టణంలోని శనివారం 1వ వార్డు కుమ్మర వీధిలో టిడిపి నాయకుడు, ఏలేరు నీటి సంఘం అధ్యక్షుడు సోమ సత్యనారాయణ ప్రచారం నిర్వహించారు. గ్రాడ్యుయేట్ ఓటరులందరినీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ కి ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ అల్లవరపు నగేష్, రాయుడు శ్రీనుబాబు, బంగారు బాబు, కోళ్ళ అశోక్, రాజా, వి.సురేష్, శ్రీను, కోడిగుడ్ల పెద్ద, దొరబాబు తదితరులు పాల్గొన్నారు.
