కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలోని న్యాత రాజకుమార్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను మృతుడు రాజ్ కుమార్ తో పాటు చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా 50 కిలోల బియ్యం, ఐదు వేల నగదును అందజేశారు. తమతో పాటు చదువుకున్న పూర్వ విద్యార్థి ఆకస్మిక మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని తెలియజేస్తూ తోటి విద్యార్థి కుటుంబానికి అండగా నిలిచేందుకు తమ వంతు సహకారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఐలయ్య, అంజయ్య, తిరుపతి, రమేష్, లక్ష్మణ్, శేఖర్, ప్రభాకర్, ఐలయ్య, రాజ్ కుమార్, రాము, సునంద్, మురళి, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.