కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామానికి చెందిన ముత్యాల రజినిపై శుక్రవారం కేసు నమోదు అయినట్లు ఎస్సై తాండ నరేష్ తెలిపారు. నా కుమారుడు చరణ్ తేజ్ కు చొప్పదండిలోని ఓ స్కూల్లో సీటు ఇప్పిస్తానని మైలారం గ్రామానికి చెందిన ముత్యాల రజిని 75,000 తీసుకొని ఆ సీటు ఇప్పించకపోగా, సంబంధిత డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేసిందని కరీంనగర్ కు చెందిన వడ్లకొండ వాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేష్ తెలిపారు.
