కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామ శివారులో పోలీసుల వాహన తనిఖీ చేపట్టిన సమయంలో, 100 గ్రాముల గంజాయిని ముగ్గురు యువకులు తీసుకెళ్లుతూ పట్టుబడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన నోముల వివేక్, చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం గ్రామానికి చెందిన నిమ్మకంటి శివ, గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామానికి చెందిన కాట గణేష్ వద్ద నుండి 100 గ్రాముల గంజాయి, రెండు బైకులు మరియు మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తాండ్ర నరేష్ తెలిపారు.
పోలీసుల హెచ్చరిక:
గంజాయి వ్యాపారం మరియు మాదకద్రవ్యాల వినియోగంపై పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని ఎస్సై తాండ్ర నరేష్ హెచ్చరించారు. చట్టవిరుద్ధంగా మాదకద్రవ్యాలను అమ్మిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.