కరీంనగర్ జిల్లా: క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందని యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి అన్నారు.
మండలంలోని గునుకుల కొండాపూర్ లో శనివారం అల్లూరి శ్రీనాథ్ రెడ్డి యువసేన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను బెజ్జంకి మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందని, శారీరక వ్యాయామం మానసిక ఉల్లాసం కలుగుతుందని అన్నారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి వారిలో ఉన్న ప్రతిభ తో విజయం సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి డైరెక్టర్ న్యాలపట్ల కనుకయ్య, ఖాసీంపేట మాజీ ఉప సర్పంచ్ బద్దం సంపత్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ గన్నేరువరం మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పరిపూర్ణాచారి,యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు లింగంపల్లి హరి,యువజన కాంగ్రెస్ మానకొండూర్ నియోజక వర్గ ప్రధాన కార్యదర్శి తాడురి వంశిక్రిష్ణ రెడ్డి, నాయకులు సంగు వేణు, తాళ్లపల్లి రవి, న్యాలపట్ల రాజు, మరియు గునుకుల కొండాపూర్ టీం కెప్టెన్ రాకేష్, ఖాసీంపేట కెప్టెన్ సందీప్ ఇరు జట్ల ప్లేయర్స్ తదితరులు పాల్గొన్నారు.
