కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని ఖాసీంపేట రైతు వేదికలో, శాస్త్రవేత్తల మరియు జిల్లా వ్యవసాయ అధికారి జై భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడమైనది. వ్యవసాయ పరిశోధన కేంద్రం కరీంనగర్ వారు భారతీయ మొక్కజొన్న పరిశోధన కేంద్రం లుధియానా వారి సహకారంతో ఖాసీంపేట మరియు పారువెళ్ల గ్రామాలలో 250 మంది రైతులకు మొక్కజొన్న విత్తనాలు మరియు గడ్డి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి జయ భాగ్యలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు రైతులకు సిఫారసు చేసిన ఎరువులను మాత్రమే వాడాలని యూరియా వాడకం తగ్గించాలని రైతులకు సూచించారు. వ్యవసాయ పరిశోధన కేంద్రం కరీంనగర్ అధిపతి ఉషా రాణి మేలైన విత్తనాలు వాడాలని సూచించారు. మండల వ్యవసాయ అధికారి జై కిరణ్మయి శాస్త్రవేత్తలు చెప్పిన సూచనలు పాటిస్తూ సిఫారసు చేసిన మేరకు మాత్రమే యూరియా వాడాలని భూసారాన్ని పెంచాలని కోరారు.డాక్టర్ డి.శ్రావణి శాస్త్రవేత్త మాట్లాడుతూ ఎన్ఎఫ్ఎస్ఎం కింద 500 మంది రైతులకు విత్తనాలు గడ్డి మందులు జిల్లాలో పంపిణీ చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారి అనుష మరియు 250 మంది రైతులు పాల్గొన్నారు.
