కరీంనగర్ జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 24 నుండి నిన్నటి వరకు పాఠశాలలకు ఉన్న వేసవి సెలవులు ముగిసిపోయి నేటి నుండి పాఠశాల ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా గన్నేరువరం మండలం విద్యాశాఖ అధికారి కె.రామయ్య మాట్లాడుతూ పాఠశాలలు గురువారం నుండి ప్రారంభం అవుతున్నాయని ప్రారంభం ముందుగానే ఆరో తేదీ నుండి బడిబాట ప్రారంభించామని తెలియజేసినారు. గత విద్యా సంవత్సరం మండలం జిల్లాస్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించినదని వంద శాతం ఉత్తీర్ణత సాధించిన మండలంగా జిల్లా కలెక్టర్ మన్ననలను పొందినామని తెలిపినారు. ఈ విద్యా సంవత్సరం కూడా పాఠశాలలో గుణాత్మక విద్య అందించడానికి వేసవి సెలవులలో ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపినారు. అదేవిధంగా పాఠశాలల్లో బడి ఈడు పిల్లలందరినీ చేర్చే విధంగా బడిబాట కార్యక్రమాన్ని కూడా ఒక ప్రణాళిక బద్ధంగా నిర్వహిస్తున్నామని తెలియజేసినారు. పాఠశాలలో ప్రారంభమయ్యే నాటికే పాఠశాలలకు విద్యార్థులకు అందించే ఉచిత పాఠ్యపుస్తకాలు మరియు ఏకరూప దుస్తులు చేరుకున్నాయని తెలిపినారు. ఉపాధ్యాయులకే కాకుండా విద్యార్థులకు పోషకాలతో కూడిన భోజనాన్ని అందించే మధ్యాహ్న భోజనం కార్మికులకు కూడా నాణ్యమైన భోజనాన్ని అందించేటంలో మెలకువ మెలకువలను వారు పాటించాల్సిన నియమాలను తెలియజేస్తూ శిక్షణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించామని తెలిపారు వారితో పాటుగా పాఠశాలలో పారిశుద్ధ్య పనులు నిర్వర్తించే స్కావెంజర్లకు కూడా పాఠశాల ఆవరణను మరియు టాయిలెట్లను శుభ్రంగా ఉంచే విధంగా వారికి కూడా శిక్షణ అందించామని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ విద్యా సంవత్సరం కూడా ఉత్తమ ఫలితాలు తీసుకొచ్చే విధంగా ఉపాధ్యాయులందరూ కూడా సమిష్టిగా పనిచేయాలని కోరినారు. నాణ్యమైన విద్యను అందించే ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్చవలసిందిగా గన్నేరువరం మండలంలోని తల్లిదండ్రులందరినీ కూడా కోరినారు. అదేవిధంగా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ కూడా బడిఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా వంద శాతం నమోదు చేసే విధంగా కృషి చేయాలని ఆదేశించినారు.
