కరీంనగర్ జిల్లా: చిగురుమామిడి మండలం ముల్కనూరు మోడల్ స్కూల్ లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కాన్సియస్ నెస్ క్లబ్స్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సమాజంపై మదకద్రవ్యాల దుష్ప్రభావం వాటి నివారణకు తీసుకోవలసిన చర్యలను గూర్చి ఎక్సైజ్ సీఐ భారతి వివరించారు. ఈ కార్యక్రమంలో మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని విద్యార్థులందరూ ప్రతిజ్ఞ చేశారు. పాఠశాల ప్రిన్సిపల్ హర్జిత్ కౌర్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాల్గొన్నారు.
