- బిజెపి పార్టీ సీనియర్ నాయకులు తాళ్లపెళ్లి హరి కుమార్ గౌడ్ గుండెపోటుతో మృతి
కరీంనగర్ జిల్లా: పట్టణంలోని శాస్త్రి రోడ్డు లో నివాసం ఉంటున్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు తాళ్లపల్లి హరి కుమార్ గౌడ్ తన నివాసంలో గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు.. తాళ్లపెళ్లి హరికుమార్ గౌడ్ మృతితో బిజెపి నాయకులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.. వివిధ పార్టీ నాయకులు హరి కుమార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు.