కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని జంగపల్లి గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్మించ తలపించిన మడేలేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి తనువంతగా 11వేల రూపాయలు విరాళంగా అందజేశారు. గ్రామ రజక సంఘం ఆధ్వర్యంలో శ్రీనాథ్ రెడ్డికి శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు వర్కోలు వెంకట్, బుర్ర కనకయ్య, మాజీ ఎంపిటిసి అటికం రాజేశం గౌడ్, రజక సంఘం అధ్యక్షుడు వర్కోలు సమ్మయ్య, పాలకేంద్రం చైర్మన్ వర్కోలు సంతు, హనుమాన్ల శ్రీనివాస్, గన్నేరువరం పద్మశాలి సంఘం అధ్యక్షులు గుంటుక లింగయ్య తదితరులు పాల్గొన్నారు
