కామారెడ్డి జిల్లా: అన్నంలో పురుగులు.. పప్పుచారు లోనూ పురుగులు.. చివరికి తాగే నీళ్లలోనూ అవే దర్శనమిస్తుండటంతో గిరిజన గురుకుల కళాశాల విద్యార్థినులు ఆందోళనకు దిగారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో నిజాంసాగర్ ప్రధాన రహదారిపై సోమవారం వారు రాస్తోరోకో చేపట్టారు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న తహసీల్దార్ ప్రేమ్‌కుమార్, అదనపు కలెక్టర్ విక్టర్‌తో విద్యార్థినులు తమ గోడు వెల్లబోసుకున్నారు. అన్నంతోపాటు కూరలు, స్నాక్స్‌లోనూ పురుగులే ఉంటున్నాయని, వాటిని తినడం వల్ల తమకు తరచూ కడుపునొప్పి వస్తున్నదని రోదిస్తూ చెప్పారు.
