● చెడు వ్యసనాలకు లోనై ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్న యువత
● దొంగతనం చేసి పట్టుబడ్డ యువకుడు
కరీంనగర్ జిల్లా: ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ చెడు వ్యసనాలకు లోనై రాగంపేట గ్రామానికి చెందిన కొలిపాక మధు కుమార్ అనే యువకుడు వివిధ చెడు వ్యసనాలకు బానిసై ఉచిత డబ్బు సంపాదించాలని కోరికతో ఆన్లైన్ లో బెట్టింగ్ యాప్స్ వాడుకుంటూ డబ్బు సరిపోకపోవడంతో దొంగతనం చేయాలని అనుకుని రాగంపేట గ్రామంలోని కొమురయ్య ఇంటిలో తేదీ 8 జూలై 2025 రోజున పట్టపగలు ఇంటిలో ఎవరు లేని సమయంలో లోపలికి ప్రవేశించి తాళం వేసి ఉన్న బీరువాను పగలగొట్టి అందులో దాచి ఉంచిన ఒక తులం బంగారం మరియు 22 వేల రూపాయల నగదు దొంగిలించి నాడు అదే రోజు ఫిర్యాదు తీసుకున్నటువంటి చొప్పదండి ఎస్ఐ నరేష్ రెడ్డి తమ సిబ్బంది తో దర్యాప్తు నిర్వహించి ఈరోజు ఇట్టి వ్యక్తిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి అదుపులోకి తీసుకోవడం జరిగింది.
అరెస్ట్ అయిన యువకుడి నుండి బంగారం మరియు డబ్బులు రికవరీ చేసి, అతన్ని ఈరోజు గౌరవ న్యాయ స్థానం నందు హాజరు పరచారు.
ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్
ఏ. ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ యువతకు మంచి ఆలోచన సరళి పెంపొందించుకోవాలని చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అదేవిధంగా గ్రామాలలో మరియు ప్రధానమైనటువంటి కూడలిలో గ్రామ ప్రజలు మరియు ఇతర సంఘాల సహకారంతో తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఇట్టి కేసు దర్యాప్తులో పాల్గొని నిందితున్ని చాకచక్యంగా పట్టుకున్న చొప్పదండి ఎస్ఐ నరేష్ రెడ్డి ని మరియు సిబ్బంది ఏఎస్సై సమ్మయ్య, అనిల్ కుమార్, బి శ్రీధర్ మరియు ఎండి ఖలీఫాలను లను అభినందించారు.