కరీంనగర్ జిల్లా: కేశవపట్నం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ని మంగళవారం మానకొండూరు నియోజవర్గ ఎమ్మెల్యే డా,కవ్వంపల్లి సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు మధ్యాహ్న భోజన స్టాఫ్ తమను ఇష్టానుసారంగా తిడుతున్నారని, మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని ఇద్దరు బాలికలు ఏడుస్తూ ఎమ్మెల్యేతో వాపోయారు. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేస్తూ ‘ఏమమ్మా నీ ఇల్లా ఇది, నీ ఇంట్లకెల్లి పెడ్తున్నావా’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వీరిపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని జిసిడిఓ కృపారాణిని ఆదేశించారు.
