● పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సు..
కరీంనగర్ జిల్లా: పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, షీ టీమ్స్ సేవల గురించి అవగాహన కలిగి ఉండాలని టాస్క్ ఫోర్స్ ఎస్సై మామిడాల సురేందర్ అన్నారు.శుక్రవారం గన్నేరువరం మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, షీ టీమ్స్ సేవల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ సోషల్ మీడియా మాధ్యమాలలో గుర్తుతెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం తగదని, గుర్తు తెలియని వ్యక్తులకు ఓటీపీలు చెప్పరాదని సూచించారు. బాలికలు ఎవరైనా వేధింపులకు గురి చేస్తే షీ టీం ను సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవాలని షిటీం యొక్క ఆవశ్యకతను వివరించారు.ఈ కార్యక్రమంలో షీటీం సభ్యులు పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.