కరీంనగర్ జిల్లా: పట్టణంలోని హనుమాన్ నగర్‌లో బ్లూ బెల్స్ హై స్కూల్ లో శనివారం గ్రీన్ డే వేడుకలు ఉత్సాహభరితం గా మరియు ప్రకృతిని ప్రేమించే భావంతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం “Go Green – Grow Green” అనే థీమ్ ఆధారంగా జరగడం విశేషం. ఈ వేడుకలకు పాఠశాల కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపల్ జంగ సునీతా మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ప్రకృతి పరిరక్షణ పై స్ఫూర్తిదాయకంగా ప్రేరణనిచ్చారు. ఈకార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్య కార్యక్రమాలు ప్రీ ప్రైమరీ విద్యార్థుల నుండి ఆకట్టుకునే ఫ్యాన్సీ డ్రెస్సులు – వృక్షాలు, భూమి, పచ్చదనం పాఠశాల విద్యార్థుల నుండి పర్యావరణ పాటలు, నృత్యాలు, ఉపన్యాసాలు మరియు స్కిట్‌లు మొక్కల నాటకం – ప్రతి విద్యార్థి ఒక మొక్క తెచ్చి నాటారు. పాఠశాల తరపున అన్ని తరగతుల గదులను ఆకర్షణీయంగా పచ్చగా అలంకరించడం జరిగింది. విద్యార్థులు పచ్చని పండ్లు, మొక్కలు లేదా పునర్వినియోగ పరచగల వస్తువులు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా స్కూల్ మేనేజ్మెంట్ అన్ని ఉపాధ్యాయుల కృషిని అభినందించింది. ఈ వేడుక విద్యార్థుల్లో పర్యావరణ స్మృతి పెంపొందించేలా విజయవంతంగా ముగిసింది.
