కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలో ఎల్లమ్మ దేవాలయం వద్ద శనివారం తిమ్మాపూర్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్లు ను అందజేశారు. ముందుగా గన్నేరువరం మండలంలోని పలు గ్రామాల గీత కార్మికులకు ట్రైనర్స్ పొన్నం వెంకటేష్ గౌడ్, వెంగలి తిరుపతి గౌడ్, గుర్రం శ్రీనివాస్ గౌడ్,బత్తిని శ్రీనివాస్ గౌడ్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చారు. అనంతరం ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 55 మంది గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎక్సైజ్ ఎస్సై భారతి మాట్లాడుతూ గీతా కార్మికులకు ప్రమాదాలు నివారించడానికి ఉపయోగపడుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గన్నేరువరం గౌడ సంఘం మండల అధ్యక్షులు బుర్ర తిరుపతి గౌడ్, మండల కోశాధికారి బుర్ర రాజ్ కోటి గౌడ్,నాగుల కనకయ్య గౌడ్, బుర్ర మల్లేశం గౌడ్, బుర్రమె మల్లయ్య గౌడ్,బుర్ర లక్ష్మీరాజాం గౌడ్, బుర్ర అంజయ్య గౌడ్, బుర్ర రమణ గౌడ్, బండారి రవీందర్,బుర్ర రాము, బుర్ర రాములు, బుర్ర శ్రీనివాస్, చెక్కిళ్ల చంద్రయ్య, ఎక్సైజ్ కానిస్టేబుల్ జి.నరేష్, ఏ.కొండల్ రెడ్డి,ధనలక్ష్మి వివిధ గ్రామాల గీత కార్మికులు పాల్గొన్నారు.
