కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలం ఖాసీంపెట్ గ్రామానికి చెందిన బత్తుల సాగర్ తండ్రి ఎల్లయ్య ఈనెల 22 న మంగళవారం నాడు కువైట్ లో గుండెపోటుతో మరణించారు. కువైట్ లో సాగర్ కార్పెంటర్ దగ్గర హెల్పర్ గా పనిచేస్తున్నాడు.. పనిచేస్తుండగానే గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి ఒక కూతురు ఉంది. గత మూడు సంవత్సరాల నుండి కువైట్ లో ఉన్నాడు. రెండు నెలల కింద వచ్చి వెళ్ళాడు.. ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందించాలని మృతిని భార్య సారవ్వ కోరుకుంటుంది. మృతదేహాన్ని ఇండియాకు రప్పించడానికి ఎన్ఆర్ఐ వారు , కువైట్ మంత్రి కృషి చేశారు. గురువారం ఉదయం స్వగ్రామమైన ఖాసీంపెట్ గ్రామానికి మృతదేహం చేరుకుంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వ ఆదుకోవాలని గల్ఫ్ కార్మికుల సంఘం నాయకులు కోరారు.
