కరీంనగర్ జిల్లా: భారీ వర్షాల నేపథ్యంలో కరీంనగర్ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం కరీంనగర్ జిల్లాలో 49.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో సహాయం కోసం 0878 2997247 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలని తెలిపారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోనూ కంట్రోల్ రూమ్ ఏర్పాటయిందని, మున్సిపల్ కార్పొరేషన్ సహాయం కోసం 9849906694 కు ఫోన్ చేయాలని తెలిపారు. వర్షాల వల్ల జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం, పశువులు చనిపోవడం జరగలేదని, పంట నష్టం వాటిల్ల లేదని తెలిపారు. వర్షాల కారణంగా ఇండ్లు, రోడ్లు, వంతెనలు, కల్వర్టులు, ట్యాంకులకు ఎటువంటి నష్టమూ జరగలేదని తెలిపారు.
