కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని చీమలకుంటపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ అమీనా బేగం రెండు రోజులు ఇంటికి తాళం వేసి తన బంధువులు ఇంటికి వెళ్లి వచ్చింది. తన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి బీరువా పగలగొట్టి ఐదు గ్రాముల బంగారం మరియు 25 తులాల వెండి అభరణాలు దొంగలించారని గన్నేరువరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ నరేందర్ రెడ్డి కేసు నమోదు చేసుకొని సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు.
