కరీంనగర్ జిల్లా: గల్ఫ్ దేశం వెళ్లి వచ్చిన మూడు నెలలకు అప్పుల బాధతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన గన్నేరువరం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం మండల కేంద్రానికి చెందిన పబ్బతి చంద్రయ్య సం (48) తన ఇంట్లో ఎవరు లేని సమయంలో జామ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతునికి ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ప్రమీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేందర్ రెడ్డి తెలిపారు.
