- జల్సాలకు పాఠశాలలే అడ్డాలు..
- అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా గన్నేరువరం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల
కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలో ప్రాథమిక పాఠశాలలో ఆదివారం రాత్రి దౌర్జన్యంగా పాఠశాలలోకి చొరబడి తలుపులను ధ్వంసం చేసి, తరగతి గదిలో ఉన్న ఫ్యాన్లను కూడా ధ్వంసం చేశారు. ఇలాంటి దొంగలను పట్టుకొని శిక్షించాలని ఉపాద్యాయులు పోలీసులను కోరారు. సోమవారం ఉపాధ్యాయులు తో కలిసి గన్నేరువరం ఎంఈఓ రామయ్య తరగతి గదులను పరిశీలించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
● జల్సాలకు పాఠశాలలే అడ్డాలు..
గన్నేరువరం మండల కేంద్రం లో ఆకతాయిల జల్సా లకు అడ్డాలుగా మారుతున్నాయి.
పాఠశాల ప్రారంభమై నెల రోజులు అవుతున్న తరగతులు కొనసాగుతుండడం విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసేందుకు విద్యార్థులు ఎంత మేర తరగతులను వింటున్నారనే పర్యవేక్షణ చేయడానికి పాఠశాలలకు హాజరవుతున్న ఉపాధ్యాయులకు అక్కడి పరిస్థితులను చూసి నివ్వెరపోతున్నారు.. పాఠశాల అవరణంలోనే .. సిగిరెట్లు తాగడం మద్యం తాగుతూ ఆకతాయి జల్సాలు చేస్తున్నారని పలువురు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ఇక పాఠశాల మూసివేశాక వారి చేష్టలు విపరీతంగా ఉంటున్నాయని తరగతి గది లోని బల్లలు, కిటికీలు,తలుపులు, వాటర్ క్యాప్ లను ధ్వంసం చేస్తున్నారంటున్నారు.
● కనీసం పోలీసులు దృష్టి సారించకపోవడంతో ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయులు..
ఆదివారం మరియు హాలిడేస్ సమయంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు రాకపోవడంతో పాఠశాలలే మందు బాబులకు బారులుగా తయారవుతున్నాయి. బయట ఎక్కడో కూర్చుని తాగుతే బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగుతున్నందుకు పోలీసులు కేసులు పెడుతున్నారని ఆలోచన చేశారమో గానీ.. పాఠశాలల్లోనే మద్యం తాగినందుకు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను అవాసాలుగా చేసుకున్నారు. విద్యాలయాలు ఆధునిక దేవాలయాలు అని మర్చిపోతే ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలలోనే స్మోకింగ్ స్పాట్గా మార్చేస్తూ పనిలో పనిగా పాఠశాల కిటికీలు తలుపులను సైతం పగలగొట్టి అందులో ఉన్న బల్లులను విరుగొట్టడం తలుపులను, ఫ్యాన్లను ధ్వంసం చేస్తూ విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు లేకుండా చేస్తున్నారు. కనీసం పోలీసులు దృష్టి సారించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని పలువురు ఉపాధ్యాయులు అంటున్నారు…