కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలం జంగపల్లి లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో చదువుతున్న విద్యార్థులందరికీ సేవ యువత ఫౌండేషన్ సభ్యులు దాతల సహాయంతో ఉచితంగా బ్యాగులు, బుక్కులు,పెన్నులు పంపిణీ చేశారు.. ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న పేద విద్యార్థులందరికీ ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో చదువుల్లో రాణించాలని మున్ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు దాతల సహాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో కార్యక్రమాలు నిర్వహిస్తామని సేవా యువత ఫౌండేషన్ సభ్యులు తెలిపారు.. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
