కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలో ఇటీవల నాలుగైదు రోజులుగా కురిసిన వర్షాలతో పలువురు జ్వరాలబారిన పడి చికిత్స పొందుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన ముసురుతో జ్వరాలు వచ్చి మంచం పడుతున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఒకే రోజు డెంగీ జ్వరంతో ఆసుపత్రిలో చేరిన ఒక కుటుంబం నలుగురికి ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. అలాగే ఇతర కుటుంబాలు కూడా చికిత్స తీసుకుంటున్నారు. గన్నేరువరం లోని ఎస్సీ బీసీ కాలనీల్లో జ్వరాలతో అస్వస్థతకు గురై ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య రోజు, రోజుకు పెరుగుతోంది. మురుగునీటి నిలువల్లో రసాయన ద్రవాలను చల్లేందుకు అధికారులు చోద్యం చేస్తున్నారు. ఇప్పటికే ఇంటింటా ర్యాపిడ్ సర్వే నిర్వహించి జ్వరపీడితులను గుర్తించి మందులను అందించాలని ప్రజలు కోరుతున్నారు. దోమలు పెరగకుండా ఇళ్ల ముందు మురికిగుంతల్లో రసాయన ద్రవాలను పిచికారీ చేయించాలని గన్నేరువరం గ్రామ ప్రజలు అధికారులను వేడుకున్నారు.
