● కాంగ్రెస్,బిఆర్ఎస్ లకు ప్రజలు ఆదరించే పరిస్థితి లేదు..
● భవిష్యత్తు అంతా బిజెపిదే …
● బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
కరీంనగర్ జిల్లా: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం బిజెపి నాయకులు కార్యకర్తలందరూ. ప్రతి పల్లె కు పోవాలని, భారతీయ జనతా పార్టీని గడపగడపకు తీసుకువెళ్లాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం గన్నేరువరం మండలకేంద్రంలో శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో బీజేపీ మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేష్ అధ్యక్షతన బిజెపి ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి హాజరై మాట్లాడారు. స్థానిక సంస్థల్లో రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు పల్లె పల్లెకు బిజెపి కార్యక్రమాన్ని ఆగస్టులో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పల్లె పల్లెకు బిజెపి ప్రోగ్రాం ద్వారా పలు కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందన్నారు. పార్టీ శ్రేణులు పల్లె పల్లెకు బిజెపి ప్రోగ్రాం ను సక్సెస్ చేయాలన్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల్లో కాషాయ జెండా రెపరెపలాడించాలని, బిజెపి శక్తి చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్,బిఆర్ఎస్ పార్టీలను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని అన్నారు. గత బిఆర్ఎస్ మాదిరిగానే నేటి కాంగ్రెస్ సర్కార్ పాలన కొనసాగుతుందని ఆయన విమర్శించారు. జూట మాటలు, హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ చేసింది గోరంతా అయితే కొండంత ప్రచారం చేసుకుంటుందని ఆయన ఘాటుగా విమర్శించారు. అరకోరా పథకాలను అమలుచేసి ప్రజలను నిలువునా మోసం చేసిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వం దే అన్నారు. స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మళ్లీ కాంగ్రెస్ రాజకీయ డ్రామాలు మొదలుపెట్టిందని, ప్రజలను మభ్యపెట్టడానికి మళ్లీ కొత్త నాటకాలు ప్రదర్శిస్తుందని ఆయన విమర్శించారు. ఊళ్ళల్లో కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత మొదలైందని , జరగబోయే స్థానిక ఎన్నికల్లో ఆ ఫలితం కాంగ్రెస్ కు కనబడుతుందన్నారు, బిఆర్ఎస్ పార్టీ అసలు గుర్తించడం లేదని, ఆ పార్టీ అవుట్ డేటెడ్ పార్టీ అయిందన్నారు. ప్రజలంతా బిజెపి మోదీ ప్రభుత్వ పనితీరుపై విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి కట్టుబడి మోదీ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. ప్రజలంతా బిజెపి వైపు చూస్తున్నారని,ఇక భవిష్యత్తు అంతా బిజెపి దేనిని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మైపాల్ రెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆడిచర్ల రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకటరెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు రంగు భాస్కరాచారి,రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ, సీనియర్ నాయకులు ఎలేటి చంద్రారెడ్డి,కౌన్సిల్ మెంబర్ విలాసారం రామచంద్రం,కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి, నాయకులు ఆరికొంతం అనిల్ రెడ్డి, పుల్లెల రాము,అట్టికం రామచంద్రం పంబాల రాజశేఖర్,దాడి గొప్ప వినయ్, బండి తిరుపతి, గాద వెంకన్న మద్దూరి మహేష్ తదితరులు పాల్గొన్నారు.