కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలో ఎస్సీ బీసీ కాలనీల్లో జ్వరాలతో అస్వస్థతకు గురై ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య రోజు, రోజుకు పెరుగుతోంది. మురుగునీటి నిలువల్లో రసాయన ద్రవాలను చల్లేందుకు అధికారులు చోద్యం చేస్తున్నారని మంగళవారం నాడు “రిపోర్టర్ టీవీలో ” విజృంభిస్తున్న విష జ్వరాలు అనే కథనానికి బుధవారం నాడు అధికారులు స్పందించారు. మురికి కాలువలను శుభ్రం చేసి బీచింగ్ పౌడర్ ను చల్లారు. రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలను చెట్లను తొలగించారు. ఎస్సీ బీసీ కాలనీలో ఇండ్ల మధ్య ప్రభుత్వ స్థలంలో బ్లేడు ట్రాక్టర్ తో పిచ్చి మొక్కలను తొలగించి స్థలమును లెవెల్ చేశారు, ప్రభుత్వ స్థలంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ స్థలంలో ఇష్ట సారంగా కొందరు వ్యవహరిస్తున్నారని కాలనీవాసులు తెలుపగా అధికారులు ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
