కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలోని ఎస్సీ బీసీ కాలనీలో విజృంభిస్తున్న విష జ్వరాలపై రిపోర్టర్ టీవీ పలు కధనాలు ప్రచురించింది. దీంతో స్పందించిన అధికారులు తగు చర్యలు చేపట్టారు, కొమ్మెర రవీందర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో, ఆరోగ్య హాస్పిటల్ వారి సహకారంతో ఇంటింటికి వైద్య పరీక్షలు నిర్వహించి వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
ఈకార్యక్రమంలో ఆరోగ్య హాస్పిటల్ డాక్టర్. సయ్యద్ జహీడ్, డాక్టర్. కావ్య ఎండి ఫ్యసిషన్, డాక్టర్. దివ్య ఎండి ఫ్యసిషన్, డాక్టర్.హరీష్ మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కొమ్మెర రవీందర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు చింతల శ్రీధర్ రెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మాతంగి అనిల్ తదితరులు పాల్గొన్నారు.