కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలో పల్లె దవఖాన లో పలు సమస్యలు ఉన్న పట్టించుకునే నాధుడే కరువయ్యారు. ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రంలో మంచినీటి సౌకర్యం లేక డాక్టర్లు మరియు సిబ్బంది ప్రతిరోజు ఇబ్బందులు పడుతున్నారు. పక్కనే మంచినీటి ట్యాంక్ ఉన్న ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం భవనానికి వాటర్ కనెక్షన్ లేక నెలలు గడుస్తున్న పట్టించుకునే వారే కరవయ్యారు. ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం లో పరిసరాల్లో పిచ్చి మొక్కలు పెరిగి విష పురుగులు తిరుగుతూ ఆస్పత్రుల్లోకి వస్తున్నాయని సిబ్బంది భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పలు సమస్యలకు పరిష్కారం చూపాలని పిచ్చి మొక్కలను తొలగించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
◆ గన్నేరువరం మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వైద్యం కోసం పక్క మండలమైన తిమ్మాపూర్, లేకపోతే కరీంనగర్‌కు వెళ్లాల్సి వస్తోంది. అత్యవసర సమయాల్లో చికిత్స అందక ప్రాణాలు పోయే పరిస్థితి నెలకొంది. మండలంలో గన్నేరువరం, ఖాసింపేట, జంగపల్లి, గునుకుల కొండాపూర్ గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలు ఉండగా వీటిని పల్లె దవాఖానాలుగా మార్చారు.
◆ మండలానికి పీహెచ్సీ లేదు
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ 19-4-2025 గన్నేరువరం మండలంలో ఖాసీంపెట్, మాదాపూర్, మైలారం, గన్నేరువరం శివారులో శంకుస్థాపన చేశారు. కానీ పనులు మాత్రం నత్తనడకగా నడుస్తున్నాయి. త్వరగా పనులు పూర్తి చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మండల ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మండల ప్రజలు కోరుతున్నారు..