● కల్వర్టు పై నుండి వరద ఉదృతి పెరగడం తో వరద లో చిక్కుకొని పోయిన పెళ్ళి బృందం.
● పెళ్ళికొడుకుని మోసుకెళ్లిన బంధువులు.
కరీంనగర్ జిల్లా: ఊర చెరువు మత్తడి ప్రవాహం ఎక్కువై రాకపోకలు నిలిచిపోవడంతో గన్నేరువరం మండల కేంద్రంలో పెళ్లికి చేరుకోవలసిన పెళ్ళికొడుకు వాహనం వరద ఉదృతి మూలంగా రాకపోకలు నిలిపివేయడం మూలంగా విధి లేని పరిస్థితిలో బంధువులు పెళ్ళికొడుకును భుజాలపై మోసుకుంటూ అవతలి ఒడ్డుకు చేర్చి మరో వాహనంలో తీసుకొని వెళ్లారు. లో లెవెల్ కల్వర్టు సమస్యతో గన్నేరువరం మండల ప్రజలు ప్రతి సంవత్సరం ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని మండల ప్రజలు వేడుకుంటున్నారు.