ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షంతో అన్నదాతలు కుదేలయ్యారు . ఉపరితల ద్రోణి ప్రభావంతో బుధవారం, గురువారం తెల్ల వారుజామున కురిసిన అకాలవర్షం కారణంగా చేతి కొచ్చిన వరి , మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి . కొనుగోలు కేంద్రాలు , కళ్లల్లో ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది . ముందస్తుగా రైతులు టార్పాలిన్లు ఏర్పాటు చేసుకోని కారణంగా ధాన్యం తడిసి ముద్దయింది . ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయి దంచికొట్టిన ఎండలు కాస్తా మేఘాలు కమ్మి చల్లబడింది. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఉరుములు , మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కొన్నిచోట్ల హోర్డింగ్లు కిందపడి పోయాయి. పలుచోట్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. వర్షాలతో పట్టణవాసులకు కాస్త ఉప మనం కలిగితే గ్రామీణ ప్రాంతాల్లో పంటలు అతలాకుతలం అయ్యాయి . ఈదురుగాలులతో వరి నేల రాలింది. వందలాది ఎకరాల్లో మొక్కజొన్న పంట దెబ్బతిన్నది . ఆరబెట్టిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు పూర్తిస్థాయిలో దెబ్బతిన్న పంట నష్టాన్ని పూర్తిగా అంచనావేసి నష్టపరిహారం అందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు .
ధాన్యం తడిసి ముద్దయింది..
కరీంనగర్ జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం అకాల వర్షానికి రైతులకు అపార నష్టం వాటిల్లింది. గన్నేరువరం మండలంలో కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. అలాగే మైలారం గ్రామంలో కాలనీలోకి వర్షం నీరు చేరుకుంది. తీవ్రమైన ఈదురు గాలులతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
భారీవర్షంతో కోతలకు వచ్చిన పొలాలు నేలకొరిగాయి. కల్లాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది, పసుపు పంట తడిసింది. చెట్లు నేలకు ఒరిగి, ఇండ్లపై పడి తీవ్ర నష్టం చేకుర్చాయి. విద్యుత్ స్తంబాలు సైతం గాలి తీవ్రతకు విరిగి పడ్డాయి , రహదారుల వెంట విరిగిపడిన చెట్లతో రవాణా స్తంభించింది. కరీంనగర్ జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కురవడంతో భారీ ఆస్తినష్టం వాటిల్లింది. అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులు కన్నీరు మున్నీర వుతున్నారు. సుమారు 2 వేల ఎకరాల్లో కోతకు వచ్చిన వరిపంటలు , ధాన్యం కుప్పలు వర్షాల కారణం గా నష్టాన్ని చవిచూసాయి . కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో వర్షం ఈదురు గాలుల కారణంగా అనేక చోట్ల చెట్లు విరిగి రోడ్డుపై పడి కాలనీవాసులులకు ఇబ్బందికరంగా మరాయి . జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు , వైర్లు తెగిపడం వలప సరఫరా నిలిచి పోయింది. పంట నష్టం లెక్కించి అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు రైతుల ను వేడుకోవాలని మోర పెట్టుకున్నారు.
వందల ఎకరాల్లో మామిడి పంట నష్టం..
జగిత్యాల (jagityala) జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (Heavy rains) కారణంగా రైతు చేతికి వచ్చిన వరిపంట నువ్వులు నెలకొరిగింది . మామిడి నేలరాలి తీవ్రనష్టం జరిగింది. ఇప్పటికే పుత, కత లేక రైతులు లబోదిబోమంటుంటే.. మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు అకాల వర్షాలతో రైతులు మరోసారి అపార నష్టం కలిగింది. గత రెండు సంవత్సరాలుగా కరోనా నేపథ్యంలో.. ఎగుమతులు దిగుమతులు లేక మామిడి (Mango) రైతులు పెద్ద ఎత్తున నష్టపోయిన విషయం తెలిసింది. ఇప్పుడు ఈ వడగండ్ల వాళ్లతో మరోసారి భారీ నష్టం చేకూర్చిందని మామిడి రైతులు (mango farmers) అంటున్నారు. ప్రభుత్వం తమను ఆదు కోవాలని నష్టపోయిన రైతులు కోరుతున్నారు . అలాగే జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని బల్వంతపూర్ గ్రామంలో భారీవర్షాలకు పిడుగులు పడడంతో గ్రామానికి చెందిన నెలవేణి మహేష్ అనే పాడి రైతుకు చెందిన 46 గొర్రెలు మృతి చెందాయి . దీంతో తీవ్ర నష్టం కలిగిందని మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు . ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.