contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

నూతన కానిస్టేబుళ్లకు టెక్నాలజీపై శిక్షణ ముగింపు … ప్రశంసా పత్రాల అందజేత

కరీంనగర్ జిల్లా: కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో కొత్తగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లకు టెక్నాలజీ వినియోగంపై దశలవారీగా శిక్షణ తరగతులునిర్వహించినట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. గురువారంనాడు రెండవ బ్యాచ్ శిక్షణ ముగించినట్లు ఆయన తెలిపారు.

కమీషనరేట్ కేంద్రంలోని ఐటీ కోర్ కార్యాలయంలో పోలీసులు ఉపయోగించే వివిధ సాఫ్ట్‌వేర్‌లు, అప్లికేషన్‌లు, మరియు సాంకేతిక పరిజ్ఞానంపై ఈ శిక్షణకొనసాగిందని ఆయన వివరించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ, కమీషనరేట్ వ్యాప్తంగా నూతన కానిస్టేబుళ్లకు ప్రాథమిక శిక్షణతో పాటు, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి టెక్నాలజీపై పట్టు సాధించేలా ఈ ప్రత్యేక శిక్షణ అందించామని చెప్పారు.

ఈ శిక్షణలో భాగంగా, పిటిషన్ డ్రాఫ్టింగ్ నుండి ఛార్జిషీట్ దాఖలు వరకు గల విధానాలు, సీసీటీఎన్ఎస్ – 2.0 (CCTNS – 2.0), పిటిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (Petition Management System) లో ఈ-సమన్ల (e-Summons) జారీ మరియు అమలు, టీఎస్-కాప్ (TS-Cop), హెచ్‌ఆర్‌ఎంఎస్ (HRMS), ఈ-సాక్ష్య (e-Sakshya), టెక్ డాటం (Tech Datum), ఐరాడ్ దర్పణ్ సీఈఐఆర్ (IRAD Darpan CEIR), సైబర్ క్రైమ్‌లో ఆర్థిక మరియు ఆర్థికేతర నేరాల గురించి, సీడీఆర్ (CDR) వంటి అన్ని రకాల సాఫ్ట్‌వేర్ మరియు అప్లికేషన్‌లపై సమగ్ర శిక్షణ ఉంటుందని ఆయన వివరించారు.
నేరాల ఛేదనలో సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏసీపీలు జి. విజయ కుమార్, వేణుగోపాల్, ఇన్‌స్పెక్టర్ తిరుపతి, సరిలాల్, శ్రీనివాస్,వెంకటేష్,శ్రీనివాస్, తిరుమల్ ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :